కృతజ్ఞతలు తెలిపిన పవర్ స్టార్….!

ఇటీవల చిత్తూరులో జరిగిన విద్యుత్ ప్రమాదంలో మరణించిన జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల కుటుంబాలకు మెగా హీరోలతో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా నిర్మాతలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ విరాళాల్ని ఆయా సంస్థలు ఇంక మెగా హీరోలు రామ్ చరణ్ , అల్లు అర్జున్ కూడా నిన్న చెక్కులు బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది.

ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరికి పేరుతో సహా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు, అదే విధంగా జనసేన పార్టీ నుంచి కూడా పలువురు తమ తమ వంతుగా చేసిన సహాయాన్ని ప్రత్యేకంగా కొనియాడుతూ థ్యాంక్స్ చెప్పుకున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: