నేను మృతి చెందాను అంటున్న మీరా మిథున్..!

కొన్ని రోజులుగా కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్న మీరా మిథున్ తన ఒక్క ట్వీట్ తో ఒక అలజడి సృష్టించింది. తాను చనిపోయినట్లుగా తన ట్విట్టర్ అకౌంట్లోనే ఆమె పోస్ట్ పెట్టడం ద్వారా సంచలనం రేపింది. ‘‘మీరా మిథున్ మృతి చెందింది. పోస్టు మార్టం జరుగుతోంది. విచారణ మొదలైంది. రెస్ట్ ఇన్ పీస్’’ అని ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఫాలోవర్లలో అలజడి మొదలైంది.

మరి ఈ పోస్ట్ అట్టెన్షన్ కోసం పెట్టిందా లేక ఏమైనా అయిందా అని తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు మళ్ళీ ఎటువంటి స్పందన రాలేదు దానిపైన. బహుశా ఎవరైనా అకౌంట్ హాక్ చేసారని ఆరోపిస్తుందో చూడాలి. కొంత కాలంగా కాస్త మానసికంగా బాలేదని, తనకి చికిత్స అవసరమని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.

తాను సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేసింది, ‘బిగ్ బాస్’ మూడో సీజన్లోకి వెళ్లడం ద్వారా ఈమె లైమ్ లైట్లోకి వచ్చింది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: