
ప్రభాస్ సీత ఎవరు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న “ఆదిపురుష్” చిత్రం గురించి అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ దేశంలోనే భారీ విజువల్ ఎఫెక్ట్స్ కలిగిన చిత్రంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తిగా స్టూడియో రూమ్ లో గ్రీన్ మాట్ పై షూట్ చేసే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్టు, అవతార్ మరియు ఫాస్ట్ అండ్ ఫురియస్ విసువల్ ఎఫెక్ట్ కి పని చేసిన టీం ని అడిగినట్టు సమాచారం.

ఈ సినిమాకు సంబంధించి అత్యంత కీలక పాత్ర అయిన సీతాదేవి రోల్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రావణుని పాత్రకి ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ పేరు అనౌన్స్ చేసారు. ఇండస్ట్రీలో ఈ సినిమాలో సీతాదేవి పాత్రకోసం మాత్రం అనేక పేర్లు వినిపిస్తున్నాయి.

కీర్తి సురేష్ మరియు కియారా అద్వానీల పేర్లు మొదట వినిపించినా, ఇప్పుడు ఫిల్మీ లవర్స్ ఆల్ టైం హిట్ పెయిర్ అనుష్క శెట్టి మరియు అనుష్క శర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎవరు సీత దేవిగా ఫైనలైజ్ అవుతారో వేచి చూడాల్సిందే.