‘మాస్టర్’ మైండ్లో థియేటర్ రిలీజ్.

మోస్ట్ అవైటెడ్ చిత్రం ఇళయ థలపతి విజయ్ నటించిన “మాస్టర్”. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ ఈ సినిమాతో భారీ అంచనాలను క్రెయేట్ చేసాడు. అనిరుధ్ అందించిన మ్యూజిక్, అందులోను లోకేష్ కనగ్ రాజ్ లాంటి హిట్ డైరెక్టర్ కావడంతో విజయ్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.

కానీ లాక్ డౌన్ వల్ల ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాని ఆపేయాల్సి వచ్చింది. అలాగే మధ్యలో ఓటిటి రిలీజ్ లు ఊపందుకోవడంతో ఈ సినిమాకు కూడా భారీ ధరలు వచ్చాయి కానీ వాటన్నిటినీ తిరస్కరించారు. కానీ రూమర్స్ మాత్రం ఆగట్లేదు. ఈ రూమర్స్ ని కొట్టిపడేస్తూ టీం ట్విట్టర్ ద్వారా ‘ఈ చిత్రాన్ని అభిమానుల కోరిక మేరకు కేవలం థియేటర్స్ లో మాత్రమే విడుదల చేయనున్నామని ఆ వందంతులు అన్ని ఎవరు నమ్మొద్దని’ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: