
మెగా ఫామిలీ ఇంత పెద్దదా?
ఎప్పుడు తన ఫాన్స్ కి దగ్గరగా ఉండే మన మెగాస్టార్ ఏది చేసిన కేజ్రీగా చేస్తారు. సినిమా ఓపెనింగ్స్ మాట అయితే సెపరేట్‌గా చెప్పనవసరం లేదు. థియేటర్స్ ముందు పండగ వాతావరణం ఉంటుంది. అలాంటిది చిరు రాజకీయ అరంగ్రేటం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీస్కుని మల్లి ఖైదీ నం 150 తో గ్రాండ్ రే ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.

అన్నింటిలో అందరికంటే ముందు ఉండే మన చిరు సోషల్ మీడియా కి మాత్రం చాల కాలం దూరంగా ఉన్నారు. ఈ మధ్యలోనే అది కూడా ఎంట్రీ ఇచ్చేసారు. తాను సోషల్ మీడియా లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసి ఇండస్ట్రీ మొత్తం వారి సంతోషాన్ని పంచుకున్నారు. అండ్ చిరు ఏది చేసిన ట్రేండింగ్ ఏ. ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లలో ఎంటర్ అయిన మొదటి 24 గంటల్లోనే భారీ ఎత్తున ఫాలోవర్స్ ను రాబట్టుకున్నారు.
ఎల్లప్పుడూ చాల యాక్టీవ్‌గా ఉంటూ సోషల్ మీడియా మాధ్యమాలతో తన ఫాన్స్ కి ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. అలా ఇపుడు తన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ను 1 మిలియన్ మార్క్ కు చేరుకుంది.