వెంకటేష్ బలపం పట్టి ముప్పై ఏళ్ళు…

అయ్యో..అయ్యో..అయియ్యో…ఈ డైలాగ్ వినగానే మనకి విక్టరీ వెంకటేష్ గుర్తోస్తారు.తనదైన శైలిలో చెప్పిన ఆ మార్క్ డైలాగ్ ని ఇప్పటికీ కొన్ని సినిమాల్లో ఇప్పటి హీరోలు చెప్తుంటారు.సరిగ్గా సెప్టెంబరు 14,1990 లో విడుదలైన బొబ్బిలి రాజా సినిమా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై డి.సురేష్ బాబు గారు నిర్మించిన ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించారు.ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ రచనకి బి.గోపాల్ గారి దర్శకత్వం నూటికి నూరు శాతం న్యాయం చేసింది

దానికి తోడు ఇళయరాజా గారి సంగీతం చిత్ర అఖండ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా ” బలపం పట్టి , కన్యాకుమారి ” పాటలు అప్పటి ప్రేక్షకులకి ఒక ప్రత్యేక విందు అని చెప్పడం చిన్న మాటే అవుతుంది.ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ మ్యూజిక్ అవార్డు లభించింది. అందాల నటి దివంగత శ్రీ దివ్య భారతి కి ఇది మొదటి చిత్రం.రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా ఘనవిజయం సాధించింది,విడుదలైన అన్నీ కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.

  • వెంకటేష్ కి ఇది మొదటి సిల్వర్ జూబ్లీ హిట్.
  • జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత కాసుల వర్షంలో రెండో స్థానంలో బొబ్బిలి రాజా నిలిచింది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: