
సర్కారు వారి పాట తో అతనికి వందో సినిమా : సూపర్ స్టార్
టాలెంటెండ్ డైరెక్టర్ పరుశురామ్ బుజ్జి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ” సర్కారు వారి పాట” చిత్రం గురించి అందరికీ తెలిసిందే. త్వరలో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా గురించి మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు, అదేంటే ‘ గోపి కృష్ణ నర్రావుల గురించి మీ అందరితో ఈ విధంగా చెప్పుకోవటం ఎంతో ఆనందంగా ఉంది.
1988 బజార్ రౌడీ సినిమా నుండి తన సినీ ప్రస్థానం మొదలైంది అందులో నేను కూడా నటించాను.బాగా కష్టపడే తత్వం తనది పరిశ్రమ నుంచి కూడా మంచి గుర్తింపు ఉంది, అలాగే నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఇక పోతే గోపి మా సర్కారు వారి పాట సినిమాతో లైన్ ప్రొడ్యూసర్/ఫారెన్ షూట్ సహాయకుడిగా వందో సినిమా పూర్తి చేస్కొబోతున్నారు అతనికి నా అభినందనలు అంటూ ఆనందం వ్యక్తం చేసారు ‘ .