సాయి పల్లవి ఒప్పుకునేనా?

వేదాళం చిత్రాన్ని చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ రీమేక్ పనులు మెహర్ రమేష్ మొదలుపెట్టారు. అధికారికంగా దీనికి సంబందించిన విషయాలు చెప్పకపోయినా, తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ చెప్పేసారు. ఇప్పుడయితే ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్న మన బాస్, అదయ్యాక ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తారా చూడాల్సిందే. ఇదిలాఉంటే వేదళానికి మరింత మాస్ మసాలా సమకూర్చే పనిలో మెహర్ ఉన్నారని తెలుస్తుంది, దానికి సంబందించిన సపోర్టింగ్ కాస్ట్ కోసం వేట మొదలెట్టారంట.

తమిళ్ లో చేసిన లక్ష్మి మీనన్ పాత్ర ఎంతో కీలకమైనది. అయితే తెలుగులో ఈ క్యారెక్టర్ కి సాయి పల్లవి ఐతే బాగుంటుందని, సినిమాకి ఇంకింత క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారట. ఇప్పటికే చాలా సెలెక్టీవ్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్కునే సాయి పల్లవి హీరో చెల్లెలి పాత్రకి ఒప్పుకుంటుందో లేదో మరి. కానీ చిరంజీవితో నటించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందని సినీ పెద్దలు అనుకుంటున్నారు. ఏదైతేనేం చాలా కాలంగా దర్శకత్వానికి దూరం అయినా మెహర్ దీనితో పెద్ద హిట్ కొట్టి బ్యాక్ తో ఫామ్ లోకి వస్తాడని ఆశిద్దాం.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: