
సైకోయిజం డబుల్ డోస్..
కొలీవూడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మన హీరో శింబు. ఒకానొక దశలో అతని వివాదాలు మరీ శృతి మించి, చేసే సినిమాలు మధ్యలో ఆగడం, విడుదల కాకపోవడం, ఎన్నో క్యాన్సిల్ అవడం జరిగాయి.
ఒక్కప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసిన తాను, ఇప్పుడు హిట్ సినిమా చూసి చాలా కాలం అయిందని చెప్పొచ్చు. లొక్డౌన్ వల్ల ఆగిపోయిన వెంకట్ ప్రభు సినిమా ‘మనాడు’, అది సెట్స్ పైకి వచ్చేలోపు మరో ఇంటరెస్టింగ్ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ కాంబినేషన్ ఎవరంటే మన లెజెండరీ నటుడు కమల్ హాసన్ గారు.
అయితే కమల్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘సిగప్పు రోజాక్కల్’ ఒకటి. తెలుగులో ‘ఎర్ర గులాబీ’లు పేరుతో రిలీజై చాలా పెద్ద హిట్ కొట్టింది. సైకో కిల్లర్ రామన్ రాఘవ్ జీవిత కథ ఆధారంగా భారతీ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 80 వ దశకంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా స్ఫూర్తితోనే శింబు ‘మన్మథన్’ అనే సినిమా చేశాడు. తెలుగులో అది ‘మన్మథ’ పేరుతో రిలీజై చాలా పెద్ద విజయం సాధించింది. రెండు చోట్లా రెండు సినిమాలు సూపర్ హిట్. శింబు కెరీర్లో అతి పెద్ద విజయం అంటే అదే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు శింబు ‘సిగప్పు రోజాక్కల్’కు సీక్వెల్ చేయబోతున్నాడట.

ఇందుకు గాను కమల్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని, ఒరిజినల్‌కు కొనసాగింపులా ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. భారతీ రాజా తనయుడు, నటుడు అయిన మనోజ్ భారతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ఐతే కమల్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయ్యాక ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అవుతాడని అందరు అనుకుంటున్నారు. ఏదైతేనేం త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ చూస్తాం అన్నమాట.