ఈ ఫైనాన్సియల్ ఇయర్ ఐపోవాల్సిందే.

కరోనా వైరస్ వాక్సిన్ కోసం మన దేశంలో చాలా కంపెనీలు పోటీ పడి మరి పరిశోధనలు చేస్తున్నాయి. ఒక్కో కంపెనీ ఒక్కో స్టేజి లో వాటి రీసెర్చ్ చేస్తున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ హర్షవర్ధన్ వచ్చే ఏడాది లోనే పూర్తి స్థాయి వాక్సిన్ అందుబాటులోకి వస్తదని అన్నారు.

ఫార్మా కంపెనీలకు ఐసిఎంఆర్ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది, అందులో ముఖ్యంగా ముంబై, హైదరాబాద్ అండ్ పూణే లోని కొన్ని కంపెనీలు రాత్రి పగలు తేడా లేకుండా త్వరగా వాక్సిన్ తేవడానికి కృషి చేస్తున్నారు. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, జ్రిడ్యూస్ కదిలా, పానసీ బయోటెక్, ఇండియన్ ఇమ్మ్యూనోలోజికల్స్, మైన్ వాక్స్ లాంటి కంపెనీలు ముందంజలో ఉన్నాయ్.

మన దేశంలో లాగానే ప్రపంచమంతా కూడా ఇలాంటి పరిశోధనలు చేస్తున్నాయి. రష్యా, అమెరికా మరియు బ్రిటన్ ఇప్పటికే చివరి ఫేస్ లో ఉన్నాయ్. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కూతురిపై మొదటి వాక్సిన్ ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆ వాక్సిన్ కి వారు స్పుత్నిక్ అని నామకరణం చేసారు, అది త్వరలోనే అందరికి అందుబాటులోకి వస్తదని ఆశిస్తున్నారు.

ఈ విషయం పై హర్షవర్ధన్ మాట్లాడుతూ, మన దేశ పరిజ్ఞానం విదేశీ పరిజ్ఞానానికి ఏమి తక్కువే లేదని, మన శాస్త్రజ్ఞులు కూడా వ్యాక్సిన్ తయారీలో చాలా స్పీడుగా ఉన్నారని, బహుశా వచ్చే ఏడాది మార్చి కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తానే మొదటి వాక్సిన్ వేసుకుంటానని అన్నారు.

మొదట విడతలో కరోనా పేషేంట్స్ మరియు వృద్దులకు వేస్తామని అన్నారు. వాక్సిన్ ధర, ఉత్పత్తి, సరఫరా, తదితర అంశాలపై కమిటీలు వేసి చర్చిస్తున్నామని అన్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: