
పూరి పోయించడానికే వచ్చాడు…
క్రియేటివ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ అప్రోచ్ చాలా డిఫరెంట్. అతను అందరిలాగా కాదు, యూట్యూబ్ లో ఎదో ఫన్ వీడియోస్ చేసేసి వదిలేద్దాం అని రాలేదు, ఎవరికీ తెలియని కొత్త ఇన్ఫర్మేషన్ అందరికి మ్యుసింగ్స్ గా చేసి పిచేక్కిద్దాం అని వచ్చారు. ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది మీకు, ఎందుకంటే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న ప్రతి ఒకరికి పూరి ముసింగ్స్ గురించి సుపరిచయమే. అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ కావేవీ కవితకనర్హం అని శ్రీ శ్రీ గారు ఎప్పుడో చెప్పారు, అలాగే పూరి గారు దాన్ని చాలా సీరియస్ గా తీస్కొని, అమ్మాయిలు, దోమలు,సెక్స్, బుద్ధిజం ఆలా అని చాలా టాపిక్లపైన తన స్టైల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
పూరి చాలా రీసెర్చ్ చేస్తాడు ఇంటర్నెట్ లో, తనకి తెలియని విషయాన్నీ క్షున్నంగా తెలుసుకోవడం అంటే ఎప్పుడు ముందుంటారు. అందరికి తెలిసిన విషయం ఏంటంటే తాను తీసే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని కానీ మనందరికీ తెలియని విషయం ఏంటంటే మనకి తెలియని ఎన్నో కొత్త విషయాలు తనకి తెలుసు. అది తన ఇంటరెస్ట్, ఏదైనా పూర్తిగా తెల్సుకునేదాకా వదలని విక్రమార్కుడు మన పూరి.
తాను చెప్పే విషయం ఎదో క్లాస్ చెప్పినట్టు కాకుండా, ఇప్పటి యూత్ కి అర్ధమయ్యే పదజాలంతో, విన్న విషయాన్నీ మళ్ళీ మళ్ళీ వినేలాగా చెప్తుంటాడు. ప్రతిరోజు ఎదో కొత్త ముసింగ్ వస్తాడని వేచి చూసే వాళ్ళు వేళల్లో ఉన్నారు పూరి కి. మీరు కూడా ఒకసారి ఆ ముసింగ్స్ వినండి, ఎప్పటికి దాన్ని వదలరు, అంత బాగుంటాయి నమ్మండి.