
మహా సముద్రం లో ఐశ్వర్య
గత వారం అధికారికంగా ప్రకటించిన ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి మరియు శర్వానంద్ ల ‘మహా సముద్రం’ సినిమా. అయితే శర్వానంద్ ఎంచుకునే పాత్రలు గమ్యం, ప్రస్థానంలో లాగానే చాలా బలమైన పాత్ర పోషిస్తున్నది ఇప్పడికే తెలిసిపోయింది. అయితే ఈ చిత్రంలో శర్వా కి జంటగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని అంటున్నారు. అజయ్ ఇప్పటికే తనకి కథ చెప్పాడని, విన్న తర్వాత తాను ఎంతో ఆసక్తిగా ఉందట.
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా స్పెషల్ అంట, స్టోరీ లైన్ కాస్త వైవిధ్యంగా ఉంటుందంట. శర్వా అండ్ ఐశ్వర్య మధ్యలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నాయట. ఇంకా దీనికి సంబందించిన విషయాలు బయటికి రావాల్సి ఉంది. వైజాగ్ లో నడిచే ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ‘మహా సముద్రం’ మన ముందుకు రానుంది. ఇది మల్టీ లింగుల్ సినిమా, ఒకే సరి తెలుగు మరియు తమిళ్ లో షూట్ చేస్తున్నారు.