క్రాక్ తర్వాత ఆ దర్శకుడితోనే సినిమా..!

మాస్ మహారాజా రవితేజ, శ్రుతిహాసన్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం క్రాక్.ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్ల్ తో సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘ డాన్ శీను,బలుపు ‘ సినిమాలు సూపర్ హిట్ కావడం ఈ అంచనాలకి ఒక కారణం.

ఇకపోతే ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా చేయబోయే సినిమా పై అభిమానుల్లో కొంతవరకు కన్ ఫ్యూజన్ ఉండేది,కొన్ని రోజుల క్రితం వరకు రైడ్,రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా అని ఇంక నేను లోకల్ ఫేమ్ త్రినాధ్ రావు నక్కిన కాంబినేషన్లో అని ఉండేది.ఇద్దరి దర్శకత్వంలో సినిమా ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఏ కాంబినేషన్ ఫస్ట్ అన్నది క్లారిటీ లేదు,కానీ ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ముందు త్రినాధ్ రావు గారి దర్శకత్వంలో సినిమా ఉంటుంది అని తెలుస్తుంది.

ఈ సినిమాకి రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని రచయిత ప్రసన్న కుమార్ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ లాంటి సబ్జెక్ట్ రెడీ చేశారట.ఇంతకుముందు దర్శకులు త్రినాధ్ రావు & రచయిత ప్రసన్న కుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: