ఆపిల్ 12 కోసం ఎదురు చూసే వాళ్ళకి నిరాశే గా.

ఈరోజు జరిగిన ఆపిల్ ‘టైం ఫ్లైస్’ ఈవెంట్ ఎంతో మంది ని నిరాశకి గురి చేసింది ఎందుకంటే ఈరోజు కేవలం వాచ్ అండ్ ఐ ప్యాడ్ తో సరి పెట్టుకున్నారు. ఐ ఫోన్ 12 కోసం ఎదురు చూసే వారికీ చుక్కెదురైంది. ఈరోజు వారు కొత్త ఆపిల్ వాచ్ ఎస్ఈ, వాచ్ సిరీస్ 6 , 8 వ జనరేషన్ ఐ ప్యాడ్, మరియు కొన్ని కొత్త ఫిట్నెస్ సర్వీసెస్ అప్స్ కూడా అనౌన్స్ చేసారు. ఇండియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 6 (జి పి యస్) సుమారుగా 40 ,900 /- మరియు ఆపిల్ వాచ్ సిరీస్ 6 (జి పి యస్ + సెల్యూలర్) 49 ,900 /- ఉండవచ్చు. స్పెషల్ ఎడిషన్ (జి పి యస్) సుమారు 29 , 900 /- మరియు స్పెషల్ ఎడిషన్ (జి పి యస్+ సెల్యూలర్) సుమారు 33, 900 /- గా ఉండవచ్చు. ఇండియన్ మార్కెట్లోకి ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తాయో చెప్పలేదు.

దీనితో పాటుగా ఆపిల్ వన్ అనే కొత్త ప్లాన్ ని అనౌన్స్ చేసారు. ఈ ఒక్క ప్లాన్ సబ్స్క్రయిబ్ చేసుకుంటే ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ, ఆపిల్ ఆర్కేడ్, మరియు ఆపిల్ క్లౌడ్ 50 జి బి వరకు కేవలం 195/- ఒక యూసర్ కి మరియు 365 /- కి 200 జి బి క్లౌడ్ స్టోరేజ్ తో ఆరుగురు ఫామిలీ కి నెలకి. ఇది కేవలం కొన్ని దేశాలలో మాత్రమే మొదట అందుబాటులో ఉంటుంది. ఆ లిస్ట్ లో ఇండియా పేరు లేదు.

ఐ ప్యాడ్ 8 వ జనరేషన్ ఇండియా వై ఫై మోడల్ ధర 29 , 900 /- మరియు వై ఫై + సెల్యూలర్ మోడల్ 41 , 900 /- 32 జి బి మరియు 128 జి బి వేరియాన్ట్స్ లో మార్కెట్ లో లభ్యం అవుతాయి. వీటికి సంబందించిన మొదటి జనరేషన్ ఆపిల్ పెన్సిల్ 8 ,500 /- స్మార్ట్ కీబోర్డ్ 13 , 900 /- మరియు ఐ ప్యాడ్ స్మార్ట్ కవర్ 4 , 500 /-

కొత్త ఐపాడ్ ఎయిర్ అక్టోబర్ నుంచి మార్కెట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ధర 54 , 900 /- నుంచి 66 , 900 /- వై ఫై + సెల్యూలర్ మోడల్ లో ఉంటాయి. దీనికి సంబందించిన రెండవ జనరేషన్ ఆపిల్ పెన్సిల్ 10 ,900 /- మేజిక్ కీబోర్డ్ 27 , 900 /- మరియు స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో 15 , 900 /-

రేపు ఆపిల్ ఐ ఓ యస్ 14 అప్డేట్ కూడా రిలీజ్ అవుతుందని ఆపిల్ సిఈఓ టిమ్ కుక్ తెలిపారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: