ప్రభాస్ బర్త్ డే కానుకగా కలర్ ఫోటో…!

అమృత్ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు సాయి రాజేష్ నిర్మాతగా ప్రముఖ నటుడు సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ కలర్ ఫోటో ‘,అలాగే చాయ్ బిస్కెట్ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా పై ప్రీలుక్ నుంచే మంచి బజ్ ఏర్పడింది.సుహాస్ సరసన చాందిని చౌదరి నటిస్తుండగా కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్లలో కూడా మంచి జోరు అందుకుంది,దానికి తోడు చిత్ర టీజర్ తో పాటు విడుదలైన పాటలు కూడా కారణం విశేషం అయితే ఇప్పుడీ సినిమా విడుదల పై అధికారికంగా ప్రకటించడం మరో విశేషం. వచ్చే నెల అంటే అక్టోబర్ 23 న ‘ ఆహా ‘ లో విడుదల అవుతుంది అని చిత్ర నిర్మాత సాయిరాజేష్ తన ట్వీట్టర్ ద్వారా చెప్తూ ఆనందం వ్యక్తం చేశారు,అలాగే దర్శకుడు సందీప్ రాజ్ కూడా ‘ ప్రతి సంవత్సరం నా అభిమాన హీరో సినిమా అప్ డేట్స్ కోసం నేను ఎదురు చూస్తూంటాను,కానీ ఈ సంవత్సరం అదే రోజు నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుండడం చాలా సంతోషంగా ఉంది ‘ అని ఆనందం వ్యక్తం చేశారు. మొదటి సారిగా సునీల్ ఈ సినిమా లో నెగిటివ్ రోల్ కనిపించబోతున్నారు,ఇక ఈ సినిమా నిర్మాత అయిన సాయిరాజేష్ గారు ఈ ‘ కలర్ ఫోటో ‘ కి కథ అందించారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: