అనుకున్న సమయానికే నిశ్శబదం విడుదల….!

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే అనుష్క భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీస్కొని చేసిన సినిమా ‘ నిశ్శబదం ‘. నిన్న మొన్న వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా అమెజాన్ లో విడుదల అవుతుంది అని రూమర్లు వచ్చాయి.ఇప్పుడు అదే విషయం అయి ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ఈ సినిమా అమెజాన్ లోనే విడుదల అవుతుంది అని రూమర్లను నిజం చేసింది, వచ్చే నెల 2 న అంటే అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజు విడుదల అవుతుంది అని చెప్పింది.

ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకి రచన అందించడం తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.హేమంత్ మధుకర్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా తమిళ సంగీత దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో అనుష్క,మాధవన్ తో పాటు అంజలి , షాలిని పాండే , అవసరాల శ్రీనివాస్,సుబ్బరాజు ముఖ్యపాత్రల్లోనటిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: