
చాలా గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమా ఒప్పుకున్న సూపర్ స్టార్..!
కన్నడ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్లో పేరున్న నటుల్లో ఉపేంద్ర ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాలు కానీ సినిమా సినిమాకి నటన కానీ దేనికదే భిన్నంగా ఉంటుంది. తెలుగులో కూడా ఆయనకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు,అందరికీ సుపరిచితుడు కూడా. ఇక ప్రస్తుతం ఉపేంద్ర చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా ఒప్పుకున్నారు.వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా మొదలైన విషయం తెలిసిందే,ఈ సినిమాలో ఉపేంద్ర గారు చాలా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు ఎందుకంటే ఆయన పాత్రలో బలం దానికి ప్రాముఖ్యత లేకపోతే అంత సులువుగా ఒప్పుకోరని టాక్ దానికి నిదర్శనం ‘ సన్ ఆఫ్ సత్యమూర్తి ‘ ఇంక అంతకుముందు చేసిన సినిమాలే.
ఇక ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది తిరిగి ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.