
త్వరలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి జక్కన సప్రైజ్..?
బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి గారి పేరు అంతర్జాతీయ స్థాయిలో చేరుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జోరులో జక్కన్న మాస్ హీరోలు అయిన ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కాలం లేకపోతే ఈ వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల అయ్యేది, కానీ పరిస్థుతుల దృష్ట్యా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.
ఇక రాజమౌళి గారు ఈ సినిమా కోసం పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారట.వచ్చే నెల మొదటి వారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన భారీ సెట్లో ముందుగా ఎన్టీఆర్ సీన్స్ చిత్రీకరిస్తారట.అందులో భాగంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలారోజుల నుండి తమ హీరో తాలుకూ లుక్ గానీ ఏదైనా అప్ డేట్ ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా గోల చేస్తున్నారు కాబట్టి వారి కోసం దసరా కానుకగా ఎన్టీఆర్ పాత్ర తాలూకు వీడియో ఒకటి రిలీజ్ చేస్తారట. డి.వి.వి దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ రామ్ చరణ్ సరసన ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ కు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.