నితిన్ మరో సినిమా పై అఫిషీయల్ అప్డేట్…!

యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం భీష్మ తో సాలిడ్ హిట్ అందుకోని అదే జోరులో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమాలు ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు.ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉన్న రంగ్ దే సినిమాతో పాటు బాలీవుడ్ సూపర్ హిట్ ‘ అంధాధూన్ ‘ రీమేక్ లో నటించడానికి సిద్ధం అయ్యారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకుడు.

బాలీవుడ్ వెర్షన్ లో చేసిన టబు పాత్రలో తమన్నా ,రాధిక ఆప్టే పాత్రలో నభానటేష్ నటిస్తున్నారు.ఒరిజినల్ వెర్షన్ లో సినిమాలో ప్రతి పాత్రకి చాలా ఇంపార్టెంస్ కాబట్టి తెలుగులో కూడా ఎవరికీ వారు ఛాలెంజ్ తీసుకోని చేస్తున్నారని చిత్ర యూనిట్ అఫీషియల్ గా అప్ డేట్ ఇచ్చింది. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ బాణీలు సమకూర్చుతున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: