తెలుగులో రానా చేయగా..తమిళంలో విజయ్ చేయనున్నారు..!

అనుష్క నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ నిశ్శబ్దం ‘ అన్నీ పనులు పూర్తి చేసుకొని అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ని చిత్ర యూనిట్ సెప్టెంబర్ 21 న సోమవారం మధ్యాహ్నం 1 గంటకు అమెజాన్లో రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే,ఈ ట్రైలర్ ని తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేయగా, తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ ‘ విజయ్ సేతుపతి ‘ తమిళ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు. తెలుగు ,తమిళం, మలయాళం లో విడుదల కానున్న ఈ సినిమా ఇతర భాషల్లో ‘ సైలెన్స్ ‘ పేరుతో విడుదల కానుంది.ఇక అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజు విడుదల అవుతున్న ఈ సినిమాకి ప్రముఖ రచయిత కోన వెంకట్ రచన అందించడం తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

హేమంత్ మధుకర్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా తమిళ సంగీత దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో అనుష్క,మాధవన్ తో పాటు అంజలి , షాలిని పాండే , అవసరాల శ్రీనివాస్,సుబ్బరాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: