త్వరలో రాబోతున్న ‘అల్లుడు అదుర్స్’ !

బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల తరవాత తిరిగి హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించడం జరిగింది. రాక్షసుడు తో హిట్ అందుకున్న తరవాత మల్లి ‘అల్లుడు అదుర్స్’ తో హిట్ కొడతాను అంటున్న బెల్లం కొండా శ్రీనివాస్బెల్లంకొండ శ్రీనివాస్ మరియు ప్రకాష్ రాజ్ పై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఇఈ సినిమాలో బెల్లాకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్, అనూ ఇమాన్యుల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్ర టీజర్‌ను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. అలాగే 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు సంతోష్ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. కాగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ కనుక మంచి స్పందన వస్తుంది అన్నట్లు సంతోష్ శ్రీనివాస్ చెప్పారు. అంతే గాక ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ ని ఒక మంచి డిసెంట్ లుక్ తో అందర్నీ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటాడు మూవీ కొంచెం లేట్ ఐన గాని గట్టి హిట్ ఏ కొత్తపోతున్నాడు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: