ప్రభాస్ తర్వాతి సినిమా కోసం ఆ దర్శకులు..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న సినిమా ‘ రాధే శ్యామ్ ‘ , పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఇటీవలే ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకునే ప్రణాళికలో ఉంది.ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెల్సిందే.ఈ సినిమాలో కథానాయికగా దీపిక పడుకొనే చేస్తుండగా ప్రముఖ సంస్థ వైజయంతి మూవీస్ పతాకంపై మంచి అభిరుచి కలిగిన నిర్మాత అశ్వినీ దత్త్ గారు భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్నారు.ఇక ఈ సినిమా కోసం ప్రముఖ లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు క్రియేటివ్ హెడ్ గా పని చేయనున్నారు, ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ వారు అధికారికంగా ప్రకటించారు.

మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా సమయం వచ్చింది, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారితో పనిచేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరుతుంది. ఆయన చూపే మార్గదర్శకాలు తప్పకుండా మమ్మల్ని మరో స్థాయిలో పని చేసేలా చేస్తాయి అని ట్వీట్టర్ లో సంతోషం వ్యక్తం చేశారు. ఇక సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఈ తరం వారిని కూడా అలరించేలా ఉంటాయి.మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: