‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ కి రెడీ అవుతోంది.

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘రాధే శ్యామ్’ సినిమా తెల్సిన విషయమే అయితే ఆ షూటింగ్ రామోజీ ఫిలింసిటీ లో మొదలు పెడుతున్నట్లు రాధాకృష్ణ కుమార్ చెప్పడం జరిగింది ఇంతలోపు షూటింగ్ 50% ఐపోవాల్సింది గాని కరోనా వల్లనా ఆలస్యం అయింది అని చెప్పారు.అయితే ప్రభాస్ నవంబర్ నుండి షూట్ చేద్దామనుకున్నారు. అయితే అనుకున్న దాని కంటే ముందుగా ఇంత త్వరగా షూట్ చేయడానికి కారణం, ‘రాధే శ్యామ్’ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి ఓ భారీ హాస్పిటల్ సెట్‌ వేశారట.

కాగా ఈ షెడ్యూల్ లో దాదాపు పది రోజుల పాటు ప్రభాస్ తో పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై కూడా కీలక సన్నివేశాల షూట్ జరగనుంది.సెట్ కావడంతో అది ఐదు నెలలకు మించి ఎక్కువ కాలం ఉండదని అక్కడ సాధ్యమైనంత త్వరగా షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.ఆ తరువాత ఈ హాస్పిటల్ సెట్‌ లోనే క్లైమాక్స్ లో ప్రభాస్ పై వచ్చే కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని.. ఈ సీన్స్ సినిమాలోనే హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నాయి.ప్రభాస్ ఫాన్స్ కు అంచనాకు తగ్గగలదని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్పడం జరిగింది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: