నాగచైతన్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్నారు.

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం చేస్తున్నారు.హీరోయిన్ సాయి పల్లవి తన పాత్రకు డబ్బింగ్ కూడ స్టార్ట్ చేశారు. ఈ చిత్రం తర్వాత చేయవలసిన సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నారు చైతన్య. ఆయన జాబితాలో నెక్స్ట్ విక్రమ్ కె కుమార్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, వెంకీ అట్లూరి ఉన్నారు. ఇందులో డీసెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నది.
ఇది ఇలా ఉండగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సైన్ చేసిన ‘థ్యాంక్యూ’ సినిమా అధికారికంగా ప్రకటితమైంది.

తాజా సమాచారం మేరకు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయవలసిన చిత్రం ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉండనుందని అంటున్నారు. వెంకీ అట్లూరి ప్రజెంట్ నితిన్ హీరోగా ‘రంగ్ దే’ చిత్రం చేస్తున్నారు. అది విడుదలైన తర్వాత, నాగ చైతన్య ప్రజెంట్ చేస్తున్న సినిమాలు ముగిశాక వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది.లవ్ స్టోరీ అయిపోయిన తరువాత ఇది మొదలవుతుంది అని అక్కినేని నాగ చైతన్య చెప్పడం జరిగింది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: