మెగాస్టార్ ని మెహర్ రమేష్ హ్యాండిల్ చేయగలరా..?

మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత చేస్తున్న సినిమా ‘ ఆచార్య ‘ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది‌.ఇక సినిమా తర్వాత మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ ‘ లూసిఫర్ ‘ రీమేక్ అలాగే తమిళ వేదాలం రీమేక్ లో నటించనున్న విషయం తెల్సిందే. లూసిఫర్ రీమేక్ ని వి.వి.వినాయక్ చేస్తున్నారు, వినాయక్ డైరక్షన్ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు కాకపోతే ఈ మధ్య కాస్త ఫామ్ లో లేరు అంతే రీమేక్ ని హ్యాండిల్ చేయడంలో మాత్రం ధిట్ట అని మాత్రం తెల్సిందే. గతంలో చిరంజీవి గారితో చేసిన ‘ ఠాగూర్, ఖైదీ నెం.150 ‘ రీమేక్ సినిమాలు అఖండ విజయాన్ని అందుకున్నాయి కాబట్టి వినాయక్ పై అభిమానులకు గానీ సగటు ప్రేక్షకునికి సైతం ఈ కాంబినేషన్ పై ఎలాంటి అనుమానం లేదు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా అనగానే అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు, ఎందుకంటే మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే బిల్లా సినిమా మినహాయిస్తే కంత్రి , శక్తి , షాడో అన్నీ ఫ్లాపులే కాబట్టి మెహర్ రమేష్ చిరంజీవి గారిని హ్యాండిల్ చేయగలడా అనీ సగటు ప్రేక్షకులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు.కాకపోతే చిరంజీవి గారి జడ్జిమెంట్ మీద నమ్మకం ఉంది అంత ఈజీగా ఆయన ఒప్పుకోరు తప్పకుండా మెహర్ రమేష్ స్క్రిప్ట్ ని చిరంజీవి బాడీల్యాంగ్వేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి మెప్పించి ఉంటారు అని అభిమానుల మాట.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: