జనవరి లో మెగాస్టార్ – వినాయక్ సినిమా ప్రారంభం…!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ ఆచార్య ‘ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. దాదాపు ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ‘ లూసిఫర్ ‘ , ‘ వేదాళం ‘ రీమేక్లో నటించనున్న విషయం తెల్సిందే.

సుజీత్ లూసిఫర్ రీమేక్ నుంచి తప్పుకోగానే వేరే పేరేమీ లేకుండా వి.వి.వినాయక్ గారి పేరు వినిపించింది చిత్ర యూనిట్ నుండి, అందులోనూ మెగాస్టార్ ని ప్రెజెంట్ చేయడంలో వినాయక్ ది డిఫరెంట్ స్టైల్.అయితే ఈ సినిమా వచ్చే జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది అని సమాచారం, సంక్రాంతి తర్వాత లేదా అంతకంటే ముందే ముహుర్తం ఉంటుంది అని అంచనా.మలయాళంలో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి, ఇక వేదాళం రీమేక్ ని మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్న విషయం తెల్సిందే.ఈ రెండు సినిమాల మిగిలిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: