
డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి నితిన్ కి చెక్ పెట్టారు..!
భీష్మ తర్వాత లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమాలను నితిన్ వరుస పెట్టి చేస్తున్నారు. అందులో భాగంగానే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘ రంగ్ దే ‘ తో పాటు అంధాధూన్ రీమేక్‌లో నటించడానికి సిద్ధం అయ్యారు.
ప్రస్తుతం రంగ్ దే సెట్స్ మీద ఉండగా చాలా ఆలస్యంగా చంద్రశేఖర్ ఏలేటి సినిమా నుండి అప్ డేట్ వచ్చింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమాకి ‘ చెక్ ‘ అనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు, నితిన్ ఫేస్ ని కొంచెం రివీల్ చేస్తూ చేతికి సంకెళ్ళు ఉండి చెస్ గేమ్ ని ఫస్ట్ లుక్ లో ఒక కాంసెప్ట్ ని రిలీజ్ చేశారు.
నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మొదటి నుంచి చంద్రశేఖర్ ఏలేటి సినిమాలు వైవిధ్యంగా, ఒకరకంగా కొత్తగా ఉండటంతో ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి.