ఓటిటిలో ఎంటర్టైన్ చేయలేకపోయిన సినిమాలు…!

కరోనా లాక్ డౌన్ వల్ల రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు కొంత గ్యాప్ తర్వాత పరిస్థితుల రీత్యా జూన్ నుంచి డిజిటల్ ఫ్లాట్ ఫాం పై రిలీజ్ అవ్వడం మొదలైయ్యాయి.అందులో చెప్పుకోవాల్సి వస్తే మొదటగా జూన్‌లో విడుదలైన కీర్తిసురేష్ ‘ పెంగ్వీన్ ‘ గురించే, ఏకకాలంలో తమిళం తెలుగుతో పాటు భారీ అంచనాల మధ్య విడుదలైంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా కొంత వరకు ఆకట్టుకున్న ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి తేలిపోయింది.దాంతో అప్పటి వరకు ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లే ఉండటంతో క్లైమ్యాక్స్ వీక్ ఉండడం వల్ల మొత్తం సినిమా తేలిపోయింది.ఇక ఆ తర్వాత పేర్లు చెప్పుకోలేని కొన్ని సినిమాలు వచ్చిన వాటి అసలు చిరునామా ఏమిటో తెలియదు. ఆ మధ్య సత్యదేవ్ నటించిన ‘ 47 డేస్ , ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ‘ విడుదలైన అందులో ఉమామహేశ్వర కొంతవరకు రిలీఫ్ అనిపించిన పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది.
మళ్ళీ ‘ V ‘ సినిమా విడుదలని ప్రకటించగానే ప్రేక్షకులు అంచనాలు పెంచేసుకున్నారు ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. సుధీర్ బాబు , నాని ఇద్దరూ సినిమాలో ఉండటం ట్రైలర్ చూసి సైకో కిల్లర్ నేపథ్యం అనుకున్నప్పటికీ దొంగ పోలీస్ రేంజ్లో సినిమా అనుకొని అన్నీ వర్గాల ప్రేక్షకులు బ్లాక్ లో టికెట్ కొని చూద్దాం అన్నంత ఆరాటపడ్డారు, కానీ సీన్ రివర్స్ అయ్యింది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా అలరించిన సినిమా అయిపోయేటప్పటికీ కథా కథనాలు రోటీన్ గా ఉన్నాయి. సైకో థ్రిల్లర్ రేంజ్లో స్క్రీన్ ప్లే బ్యాక్ డ్రాప్ ఉన్నా ఓల్డ్ వైన్ బాటిల్ లా రివేంజ్ డ్రామా అని తెల్సింది.

అయితే నాని , సుధీర్ బాబు స్క్రీన్ ప్రెంజ్స్ తో కట్టిపడేసినా అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది.
ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ అందరి కళ్ళు రెడ్ , ఉప్పెన , నిశ్శబ్దం సినిమాలపై పడ్డాయి, వీటిలో ఏ ఒక్కటైనా రిలీజ్ అవ్వకపోతాదా అని.అంతా అనుకున్నట్లుగా నిశ్శబ్దం టీమ్ నుంచి ఇంక రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ ఓరేయ్ బుజ్జిగా ‘ టీమ్ నుంచి రిలీజ్ డేట్లు లాక్ అయ్యాయి. రెండు సినిమాలు గాంధీ జయంతి సందర్భంగా విడుదలైయ్యాయి, లేడి ఒరియేంటెడ్ సినిమాలు చేసి అలరించిన అనుష్క కావడంతో నిశ్శబ్దం సినిమా‌ పై మళ్ళీ అంచనాలు మొదలైయ్యాయి దానికి తోడు ట్రైలర్ కూడా కారణం అయ్యింది. ఇక రాజ్ తరుణ్ చాలా కాలం నుండి హిట్ కోసం చూడటం అందులోనూ గుండె జారి గల్లంతయ్యిందే లాంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చేసిన డైరెక్టర్ కావడంతో సాధారణంగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఓరేయ్ బుజ్జిగా కామెడీలో పర్వాలేదనిపించుకున్నా ఆద్యంతంగా సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయింది‌. నిశ్శబ్దం కూడా స్లోగా ఉండటంతో మిశ్రమ టాక్ ని సొంతం చేసుకుంది. ఓటిటిలో రిలీజ్ అయినా ఇప్పటి వరకు పెద్దగా తేడా ఏమీ అనిపించట్లేదు అంటున్నారు ప్రేక్షకులు కాకపోతే ఫ్లాప్ అయిన సినిమాలు కొంచెం లేట్ గా చూస్తాం అంతే తప్ప ఇంకేమీ స్పెషల్ కాదు అంటున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: