బన్నీ చేతుల మీదుగా మోసగాళ్లు టీజర్ విడుదల…!

చాలాకాలం నుంచి మంచు హీరో విష్ణు కమ్ బ్యాక్ కోసం చూస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో స్వీయ నిర్మాణంలో ‘ మోసగాళ్లు ‘ అనే సినిమా గత ఏడాది రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ అయిన 2016 నాటి ఐ.టి స్కామ్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది , ఇటీవలే ఈ సినిమా టీజర్ ను బన్నీ రిలీజ్ చేస్తారని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాసేపటి క్రితమే ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ తో మొదలైన టీజర్ అందులో స్కామ్ చేసే వారిలా విష్ణు ఇంక కాజల్ అగర్వాల్ కనిపించారు.భారీగా సంచుల్లో డబ్బుల మధ్య కాజల్ : ఇది సరిపోతుంది గా అంటే దానికి విష్ణు : ఆటిప్పుడే మొదలైంది అంటూ ఇంటర్వెల్ రేంజ్లో డైలాగ్ చెప్పారు దాంతో టీజర్ ఎండ్ అయ్యింది.

ఈ గ్లింప్స్ వీడియోతో అంచనాలు పెంచేసిన ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తుండగా సామ్ సి యస్ సంగీతం అందిస్తున్నారు.ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ , మలయాళం , హిందీలో విడుదల కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: