
సూపర్ స్టార్ సినిమాకి లైన్ క్లియర్..!
సూపర్ స్టార్ రజీనికాంత్ ఈ సంవత్సరం దర్బార్ చిత్రంతో అభిమానులని అలరించారు. అవుట్ అండ్ అవుట్ కోప్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా రజీని అభిమానులతో సహా మాస్ ప్రేక్షకులను అలరించింది.ఇక లాక్ డౌన్ వల్ల తర్వాతి సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెల్సిందే.
ఈ సినిమా మాస్ యాక్షన్ చిత్రాల సూపర్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది,ఇప్పటికే ప్రీ – ప్రొడక్షన్స్ పనులతో సహా కొంతవరకు షూటింగ్ నిర్వహించుకున్న కరోనా వల్ల మళ్ళీ షూటింగ్ కు నోచుకోలేదు,అందులోనూ రజీని వయస్సు రీత్యా ఆరోగ్యం పట్ల జాగ్రత్తతో ఇన్ని రోజులు మొదలుకాలేదు.
ఇప్పుడు ఏకంగా రజినికాంత్ గారి నుంచి ఆయన ఇచ్చిన సూచనల మీద తగిన జాగ్రత్తలతో ఈ నెల 15 న హైదరాబాదులో తిరిగి మొదలు కానుంది. అక్టోబర్ 8 నాటికి రజిని హైదరాబాద్ చేరుకుంటారు, అదికూడా తన వ్యక్తిగత కార్ లోనే రానున్నారని టాక్.చిత్ర యూనిట్ సభ్యులందరికీ పరీక్షల అనంతరం ప్రభుత్వం సూచించిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని షూటింగ్ నిర్వహించనుంది.ఇక డైరెక్టర్ శివ వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉండడం అందులోనూ సూపర్ స్టార్ తో సినిమా కాబట్టి అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.