అమితాబ్ బచ్చన్ – ప్రభాస్…సూపర్ కాంబినేషన్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న విషయం తెల్సిందే.ఇక ఆ తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

వైజయంతి మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో అశ్విన్ దత్త్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నుంచి ఒక క్రేజీ అండ్ ఫ్యాన్స్ విజిల్స్ వేసే అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాలో ఒక భాగం అయ్యారు ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తతో ఈ కాంబినేషన్ కే కొత్త ఉత్సాహం వచ్చింది అని చెప్పాలి, అసలు ఇది కదా అభిమానులకి కావాల్సిన ఎమోషన్.ఖచ్చితంగా బిగ్ బి ది కీ రోల్ అయి ఉంటుందనే చెప్పవచ్చు.
ఇక ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కెబోతుంది, హాలీవుడ్ స్టైల్లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతుండగా ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు క్రియేటివ్ హెడ్ గా వ్యవహరించనున్నారు.పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదకు వెళ్లనుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: