టక్ వేసుకున్న నాని…సంక్రాంతి కోసమేనా…?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు, ‘ టక్ జగదీష్ ‘ అని క్రేజీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కంటే ముందే సగంకి పైగా చిత్రీకరించుకుంది.ఇప్పుడు తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలైంది, ఈ విషయాన్ని నాని సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో రూపంలో షూట్ రీస్టార్ట్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటోలొ నాని టక్ వేసుకొని ఫేస్ మాస్క్ ని ట్యాగ్ చేస్తూ లైటింగ్స్ సజీషన్లో క్లిక్ ఇచ్చారు.

అన్నదమ్ముల అనుబంధానికి అద్దం పడుతూ చాలా ఎమోషన్లగా ఈ చిత్రం ఉండబోతుంది అని వినికిడి, ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి తర్వాత నాని రెండో సారి చేస్తుండటం అలాగే మజిలీ లాంటి ఎమోషన్ల్ సినిమా తర్వాత చేస్తుండటంతో ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

మజిలీ చిత్రాన్నీ నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నవంబర్ చివరి వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకొని సంక్రాంతి రేసులో రిలీజ్ కు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా తమన్ స్వరాలు అందిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: