పెళ్ళిసందడి మళ్ళీ తెర పైకి : కె.రాఘవేంద్రరావు…!

దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రవళి , దీప్తి భాథ్ నగర్ హీరోయిన్లుగా అచ్చ తెలుగు భారీ తారాగణంతో అందమైన ప్రేమకథతో పాటు కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. 1996 లో సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించింది , అంతేకాక ఆ సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో కల్లా బిగ్గెస్ట్ హిట్టు ‘ పెళ్లి సందడి ‘ . ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు ఎం.ఎం కీరవాణి సంగీతం కూడా సూపర్ హిట్ అయింది , అన్నీ పాటలు చార్ట్ బస్టర్. అలాగే హీరో శ్రీకాంత్ కెరీర్ కి కూడా ఈ చిత్రం పెద్ద బ్రేక్.


ఇప్పుడీ చిత్రాన్నీ మళ్ళీ తీస్తున్నట్లు దర్శకేంద్రులు సోషల్ మీడియా వేదికగా పెళ్లి సందడి మళ్ళీ మొదలువుతుంది అంటూ ఒక వీడియో రూపంలో సీక్వెల్ అన్నట్లు క్లూ ఇచ్చారు.ఇక ఈ విషయం తెలిసినప్పటి నుండి చాలా మంది ఆ సినిమా అభిమానులు ‘ ఇలాంటి క్లాసిక్ సినిమాని దయచేసి అదే టైటిల్ తో తీసి మా లాంటి అభిమానుల మనస్సు విరుచ్చొద్దు ‘ అంటున్నారు. ఈ విషయంలో సినిమా మీద అభిమానం తప్ప మరి ఏ ఇతర భావం కాదని కూడా కొంత చెప్పుకొస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: