శర్వానంద్ సినిమా కూడా అప్పుడేనా…?

లాక్ డౌన్ కంటే ముందే సెట్స్ మీద చివరి దశలో ఉన్న సినిమాల్లో శర్వానంద్ సినిమా ‘ శ్రీకారం ‘ కూడా ఉంది.వేసవి కానుకగా ఏప్రిల్ 24న డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది కాగా థియేటర్స్ రీపెన్ అనౌన్స్ తో షూటింగ్ రీస్టార్ట్ చేసుకుంది చిత్ర యూనిట్.షార్ట్ ఫిలింస్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బి.కిషోర్ ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్, 14 రీల్స్ పతాకంపై గోపి ఆచంట , రామ్ ఆచంట నిర్మిస్తున్నారు.

గొప్ప గొప్ప చదువులు చదువుకొని పుట్టిన ఊరుని అలాగే తాత ముత్తాతలు నుండి వస్తున్న వ్యవసాయాన్ని వదులుకొని డాక్టర్లు , ఇంజనీర్లుగా సెటిల్ అవుతున్న వ్యవసాయ మినహా మిగిలిన రంగాల్లో స్థిరపడుతున్న వారికి మంచి మెస్సెజ్ ఇస్తూ ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ప్రస్తుతం తిరుపతి పరిసరాలల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని క్రిస్మస్ లేదా సంక్రాంతి రేసులో విడుదల చేసే ఆలోచనల్లో ఉన్నారట నిర్మాతలు. ఇక చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం చూస్తున్న శర్వానంద్ ఈ సినిమాపై మొదటి నుంచి చాలా కాన్ ఫిడెంట్ తో ఉన్నారని టాక్. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియా అరుల్ మోహన్ నటిస్తున్నది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: