ఈ మధ్యనే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘ నువ్వే కావాలి ‘ …!

అప్పటి వరకు తెలుగులో ఫ్యాక్షన్ కథలతో సినిమాలోచ్చాయి…కుటుంబ కలహాలతో రక్తి కట్టించే కథాకథనాలతో సినిమాలోచ్చాయి..అచ్చ తెలుగు ఆహ్లాదకరమైన కుటుంబ కథలతో సున్నితమైన హాస్యంతో కూడిన సినిమాలోచ్చాయి… శివ లాంటి గ్యాంగ్ స్టర్ కథలతో సినిమాలోచ్చాయి…యూత్ ఫుల్ లవ్ స్టోరిస్ కి అప్పట్లో స్పేస్ లేదనే చెప్పాలి.

అప్పుడప్పుడు ప్రేమదేశం లాంటి ఇతర ప్రాంతీయ భాష చిత్రాలు వచ్చిన ఎక్కడో ఒకచోట లోటు ఉండేది.సరిగ్గా అలాంటి సమయంలోనే ‘ నువ్వే కావాలి ‘ వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర చరిత్రని తిరగరాసిందనే చెప్పాలి.ఆ టైంలో ఉన్న టీనేజర్స్ ని అడిగితే చెప్తారు ఈ సినిమా గురించి ఒక్కో పేజీలో.
ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాతగా కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కింది ‘ నువ్వే కావాలి ‘ , మలయాళ సూపర్ హిట్ ‘ నిరమ్ ‘ కు ఇది రీమేక్.
2000 సంవత్సరంలో అక్టోబర్ 13 న విడుదలైన ఈ చిత్రం ఈరోజుతో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది.తరుణ్ , రిచా జంటగా సాయికిరణ్ ముఖ్యపాత్రల్లో వచ్చిన ఈ చిత్రం
2 దశాబ్దాలు పూర్తి చేసుకున్నప్పటికీ బుల్లితెరపై ఈరోజుకీ అలరిస్తూనే ఉంది.

  ఎవరేవ్వరికి బ్రేక్ ఇచ్చింది..?
అప్పటి వరకు బాలనటుడిగా నటించిన తరుణ్ ఈ సినిమాతో హీరో అయ్యాడు, చక్కని నటన, అతి అనిపించని హావభావలతో , మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ చిత్రం అతనికి ఉన్నపళంగా స్టార్ హీరోని చేసింది.యూత్ లో మంచి క్రేజ్ తీసుకురావడంతో పాటు యూత్ స్టార్ హీర్ తరుణ్ అనేలా చేసింది.
హీరోయిన్‌గా నటించిన రిచా అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి ఫుల్ మార్క్స్‌ కొట్టేసింది,చక్కని అభినయంతో తన పాత్రకి న్యాయం చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు అటు బాలీవుడ్లో కూడా కొంత కాలం బిజీ అయింది.

మరో ముఖ్యపాత్రలో చేసిన సాయికిరణ్ కి కూడా ఇది మొదటి చిత్రం.ఈ సినిమా తర్వాత కొంత కాలం సోలో హీరోగా కొన్ని సినిమాలు వచ్చాయి.

సినిమా ఆద్యంతం హాస్యం ఉన్నప్పటికీ ఆ గ్యాంగ్ నుంచి సునీల్ కెరీర్ కి పెద్ద బ్రేక్ వచ్చింది.
మాటలు అందించిన త్రివిక్రమ్ అప్పటికే స్వయంవరం సినిమాతో తనలోని‌ రైటర్ ని బయట పెట్టాడు‌..ప్రాసలతో కూడిన వన్ లైన్ పంచ్ డైలాగ్స్ రాయడం త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకత.ఈ చిత్రానికి కూడా తను అందించిన సంభాషణలు సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి.
దెబ్బకు మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చిపడ్డాయి.

దర్శకుడిగా రెండో సినిమా అయిన కె.విజయ్ భాస్కర్ కి నువ్వే కావాలి పెద్ద బ్రేక్. స్వయవరం తర్వాత చేసిన ఈ సినిమా ఇటు దర్శకుడికి అటు రచయితకి సరి సమానంగా విజయాన్ని అందించింది. ఆ తర్వాత మధ్యలో త్రివిక్రమ్ గారు వేరే సినిమాలకి పని చేసినప్పటికీ వీళ్ళ కాంబినేషన్ చాలా ప్రత్యేకత.వరుసగా నువ్వు నాకు నచ్చావ్ , మన్మథుడు , మల్లీశ్వరి లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి వీళ్ళ ఖాతాలో.

సినిమాలో ఏముంది…?
హీరో భారీ ఇంట్రడక్షన్ లేదు…ఇంట్రండక్షన్ తర్వాత విలన్లను చితకొట్టే ఫైట్లు…మాస్ మెచ్చే అంశాలు అసలే లేవు.. భారీ ఇంటర్వెల్ లేదు…చిన్న కథ అంతే..
హీరో, హీరోయిన్ చిన్ననాటి స్నేహితులు… ఎలాంటి కలమషం లేకుండా టీనేజ్ దాటే వయస్సుకు వచ్చే అప్పటి నుండి కథ మొదలౌతుంది….స్నేహం తప్ప ఏమీ తెలియని ఇద్దరి మనస్సులు…ఎప్పుడూ కొట్టుకునే చిలిపితనం..కుర్రతత్వం… కాలేజీ వాతావరణం… ఫ్రెండ్స్ తో చేసే అల్లరి…సరదాగా సాగే డ్రామా…
కానీ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు..

సంగీతం… సెన్సేషన్…!
అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న కోటి…ఈ చిత్రానికి ఎవరూ ఊహించని స్థాయిలో సంగీతం అందించారు. అన్నీ పాటలు బ్లాక్ బస్టర్… నేపథ్య సంగీతం హైలట్… ఒక చిన్న సినిమాకి ఈ స్థాయిలో ఎవరూ ఊహించలేదు…
అనగనగా ఆకాశం ఉంది.. పాటైతే ఎన్ని అంత్యాక్షరిలను మొదలుపెట్టిందో…
ఎక్కడా ఉన్న పక్కన నువ్వే.. పాట కుర్ర హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.. తమ ప్రేయసిని ఊహించుకొని ఇప్పటికీ పాడుకుంటున్న సందర్భం ఉంది.

అవార్డులు…! గుర్తింపు…

నేషనల్ అవార్డ్స్…!
ఉత్తమ తెలుగు చిత్రంగా నిర్మాత రామోజీరావు గారు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.
ఉత్తమ నటుడిగా తరుణ్ , ఉత్తమ నటిగా రిచా అందుకున్నారు.
ఉత్తమ గాయకుడిగా ‘ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ‘ పాటకి శ్రీరామ్ ప్రభు అవార్డు అందుకున్నారు.

సాహిత్యం విషయానికొస్తే భువనచంద్ర , సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించారు.

సినిమా విడుదల సమయం పండుగ వేళ కూడా, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా గుర్తింపు లేని సందర్భంలో విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. కేవలం 75 లక్షల బడ్జెట్ తో నిర్మితమై మళ్ళీ క్వాలీటి వర్క్ కోసం కోటి ఇరవై లక్షలతో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది, విడుదలైన అన్నీకేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని చివరికి 6 సెంటర్లలో 365 రోజులు పూర్తి చేసుకుంది.
ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ సినిమాకి అసోసియేట్ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమా వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ బుల్లితెరపై అలరిస్తూనే ఉంది.ఈ కాలం యువతనే కాదు మరో 50 సంవత్సరాలు అయిన ఫ్రెష్ గా కనబడే సినిమే ‘ నువ్వే కావాలి ‘…..!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: