ఎప్పుడూ ముందుండే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ సారి కూడా….!

ఎప్పుడూ లేని విధంగా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ర్టాలు వరద ముంపుకు గురైయ్యాయి, ముఖ్యంగా ఎప్పుడూ లేని హైదరాబాద్ నగరం వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి అతులాకుతం అయ్యింది. దీంతో చాలావరకు పంట నష్టం అయింది హైదరాబాదులో ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది.

గతవారం రోజులుగా హైదరాబాదు నగరం పలుచోట్ల వరదలోనే చిక్కుకున్నారు, చాలావరకు ఆశ్రయం కోల్పోయారు బయటకు రాలేని పరిస్థితులలో ఉన్నారు. ప్రభుత్వం తమ వంతు కఠోర కృషి చేసినప్పటికీ ఇప్పటి వరకు బయట నుంచి ఎవరూ రాలేదు. ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి భారీ మొత్తాన్ని సి.ఎమ్ రిలీఫ్ ఫండ్ ను ప్రకటిస్తున్నారు.ఇప్పటికే బయట నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ గారు తమవంతుగా 15 లక్షలు ప్రకటించారు.ఇక మన టాలీవుడ్ నుంచి ప్రకటించిన వివరాలు.


అందులో అందరికంటే అత్యధికంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కోటి రూపాయాలు అలాగే సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సైతం ఒక కోటి రూపాయిలు తమవంతు ప్రకటించి వరద ప్రవాహానికి గురైన వాళ్ళకి ధైర్యం చెప్తూ మన హైదరాబాద్ త్వరలో మళ్ళీ మాములు స్థితికి రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ మిగితా వారు కూడా తమవంతుగా ముందుకు రావాలని కోరుకున్నారు‌.
ఇక‌ అక్కినేని నాగార్జున గారు 50 లక్షలు , జూ.ఎన్టీఆర్ 50 లక్షలు , విజయ్ దేవరకొండ 10 లక్షలు , డైరెక్టర్ అనిల్ రావిపూడి 5 లక్షలు , హరీష్ శంకర్ 5 లక్షలు , నిర్మాత రాధాకృష్ణ & డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు చొప్పున తమ తమ వంతుగా ట్వీట్టర్ ద్వారా విరాళాలు ప్రకటించారు.దీనికి స్పందిస్తూ మంత్రి కేటిఆర్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: