తారక్ అభిమానుల ఎదురుచూపుకు ఫుల్ స్టాప్…!

అరవింద సమేత విడుదలై రెండు సంవత్సరాలు అయింది, ఇక అప్పట్నుంచీ ఫ్యాన్స్ చూపు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ పైనే. అనుకున్నట్లుగా ఏడాదిలోపే సినిమా విడుదల అవుతుంది అనుకున్నారు అంతా కానీ అనుకోని పరిస్థుతుల మధ్య సినిమా 2021 సంవత్సరానికి వాయిదా పడింది.

ఆ మధ్య శరవేగంగా షూటింగ్ జరుపుకున్నా కరోనా కారణంగా బ్రేక్ పడింది, లాక్ డౌన్ ప్రారంభంలో చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఒక మాస్ ఫీస్ట్ ని ఎన్టీఆర్ కానుకగా తన అభిమానులకు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక తారక్ అభిమానులు సైతం తమ హీరో టీజర్ కోసం సోషల్ మీడియాలో చేసిన లోల్లి అంతా ఇంతా కాదు దెబ్బకి యూనిట్ సైతం ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా తారక్ అభిమానుల కోసం ఒక మాస్ ఫీస్ట్ టీజర్ ను రెడీ చేసారు.ఆ టీజర్ నే ముందు చెప్పినట్లుగానే దసరా కానుకగా అంటే అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు చరణ్ విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్ , ఇక ఈ వార్తతో అభిమానుల ఎదురు చూపుకు తెర పడింది, వాళ్ళు ఇప్పుడు ట్వీట్టర్లో ట్రెండ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: