నాని చిత్రానికి కొత్త నిర్మాత రావడానికి గల కారణం…!

ఇటీవలే ‘ V ‘ తో కొంత వరకు అలరించిన నాని , తన తర్వాతి సినిమాలపై దృష్టి పెట్టిన విషయం తెల్సిందే.అందులో భాగంగానే ‘ నిన్ను కోరి ‘ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సారి ‘ టక్ జగదీష్ ‘ అనే సినిమాతో పాటు ‘ టాక్సీవాలా ‘ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘ శ్యామ్ సింగరాయ్ ‘ అనే సినిమా చేస్తున్నారు.

రెండు వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్నాయి అనే సమాచారం ఉంది.ఇక ‘ శ్యామ్ సింగరాయ్ ‘ సినిమా నుంచి నిర్మాత నాగదేవర సూర్యవంశీ తప్పుకున్నట్లు తెల్సింది.ఈ సినిమా బడ్జెట్ విషయమై అనుకున్నట్లుగా డీసెంట్ బడ్జెట్ తో చేస్తే ఈ సినిమా క్వాలీటి పై ప్రభావం పడవచ్చు అనే అనుమానంతో ఇక ఈ సినిమా బడ్జెట్ మినహాయించి పెట్టే ఉద్దేశం లేదని తప్పుకున్నట్లు తెలిసింది. ఇక 14 రీల్స్ సంస్థలో పలు చిత్రాలను సమర్పించిన వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనట్లు తెలుస్తుంది. ఈ విషయాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: