ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ తో మాస్ రాజా ఫ్లాప్స్ నుంచి బయట పడుతారా…?

ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హిట్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ గతకొన్ని సంవత్సరాలుగా ఫ్లాప్స్ లో ఉన్నారు. తన బాడీలాంగ్వేజ్ ఇంక పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న సరైన కథాంశం లేని సినిమాలు తన కెరీర్ గ్రాఫ్ పైన ప్రభావం చూపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈవిధంగా గత మూడు సంవత్సరాలుగా ఒక్క ‘ రాజా ది గ్రేట్ ‘ మినహాయిస్తే అన్నీ సినిమాలు ఫ్లాప్స్ హే.ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన ‘ డిస్కోరాజా ‘ కూడా ఆశించినంత ఫలితం ఇవ్వలేకపోయింది.ఇక వేసవి కానుకగా విడుదలవ్వాల్సిన క్రాక్ సినిమా పైనే అందరి ఆశలు ఉన్నాయి, కానీ అది విడుదల అయ్యేప్పటికి కొంచెం టైం పడుతుంది.ఈ సినిమా పూర్తి అవుతున్న నేపథ్యంలో తన తర్వాతి సినిమా గత సంవత్సరం ‘ రాక్షసుడు ‘ సినిమాతో భారీ హిట్ అందుకున్న రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ ఖిలాడి ‘ అనే టైటిల్ పెట్టిన విషయం తెల్సిందే. వీళ్ళ కాంబినేషన్లో గతంలో ‘ వీర ‘ సినిమా వచ్చింది.

ఆ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేదనే చెప్పాలి , రవితేజ కెరీర్‌లో అది ఫ్లాప్ చిత్రంగానే మిగిలిపోయింది. అలాంటిది మళ్ళీ అదే డైరక్టర్ తో చేస్తున్నందున అసలే ఫ్లాప్స్ లో ఉన్న మాస్ రాజా ఈ డైరక్టర్ సినిమా నుంచి హిట్ అందుకుంటాడా అనే మాట వినబడుతుంది. ఈ డైరక్టర్ గ్రాఫ్ కూడా ఏమాత్రం చెప్పుకోదగ్గ విధంగా లేదు , కాకపోతే రీమేక్ తో భారీ హిట్ అందుకున్న కారణంతో అయిన మరోసారి ఈ సినిమాతో మరో హిట్ అందుకోని రవితేజకి కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: