బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ‘ నర్తనశాల ‘….రిలీజ్…!

2004 అంటే 14 సంవత్సరాల క్రితం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టిన చిత్రం ‘ నర్తనశాల ‘ చాలా మందికి గుర్తులేకపోవచ్చు ఎందుకంటే ఇది కొంత వరకు మాత్రమే చిత్రీకరణ జరుపుకొని ఆగిపోయింది.అలనాటి అందాల సహజ నటి అయిన సౌందర్య ఈ చిత్రంలో ద్రౌపది పాత్రలో నటిస్తుండగా అనుకోకుండా జరిగిన విమాన ప్రమాదంలో ఆమె మరణించారు.

కాబట్టి ఈ సినిమా అప్పటి నుంచి కార్యరూపం దాల్చలేదు.ఇకపోతే బాలకృష్ణ గారు తనకు ఎంతో ఇష్టమైన సినిమా కావడంతో ఆ చిత్రీకరించింన కొంత భాగాన్ని ఎడిట్ చేసి ప్రేక్షకుల మధ్యకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 24 న అంటే దసరా కానుకగా శ్రేయాస్ ET ద్వారా 17 నిమిషాల చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈరోజే బాలకృష్ణ ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యింది, ఇకపోతే ఈ సినిమాలో అర్జునుడిగా బాలకృష్ణ , ద్రౌపదిగా సౌందర్య , భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ బాబు నటించారు.

అప్పట్లో సౌందర్య స్థానంలో వేరే ఎవరినీ ఊహించక ఈ సినిమా ఆగిపోయింది.దాంతో అభిమానులతో సహ సగటు ప్రేక్షకులు సైతం నిరాశ చెందారు.ఇప్పుడు ఆ నిరాశకు తెర వేస్తూ ఆ చిత్రీకరించిన 17 నిమిషాల సన్నివేశాలను చూడాలన్న కోరిక కనీసం తీరుతుంది.ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగం ఛారిటీస్ కి ఇవ్వనున్నామని బాలకృష్ణ గారు తెలియాజేశారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: