18 pages లో అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్…!

వరుస సినిమాలతో హిట్స్ తో సంబంధం లేకుండా దూసుకుపుతున్నాడు యువ హీరో నిఖిల్.లాక్ డౌన్ లో పెళ్ళి చేసుకున్న నిఖిల్ ప్రస్తుతం పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే తన సూపర్ హిట్ చిత్రం కార్తీకేయా సీక్వెల్ లో చందు ముండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. దీనితో పాటు గీతా ఆర్ట్స్ సంస్థలో సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో బన్ని వాసు నిర్మాతగా ” 18 pages ” అనే రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ‘ కరెంట్ , కుమారి 21 ‘ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు, సుకుమార్ గారు కథ అందిస్తున్నారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనున్నారు,ఎప్పటిలాగే వైవిధ్య కథలతో సినిమాలు చేస్తున్న నిఖిల్ ఈ సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఒక డిఫరెంట్ పాయింట్ తో ఉండనుంది అని సమాచారం. నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: