కొమరం భీమ్ గా తారక్ విశ్వరూపం…!

అభిమానుల కోరిక మేరకు అనుకున్నట్లుగా జక్కన వారి కోసం మాస్ ఫీస్ట్ వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఇచ్చారు. కొద్ది క్షణాల క్రితం విడుదలైన ఈ టీజర్ లో మొదట చరణ్ పై ప్లాన్ చేసిన టీజర్ తరహాలోనే చరణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయిన ఈ టీజర్ ఒక అద్భుతం అనే చెప్పాలి జక్కన చూపించిన విజువల్స్ వాటినే బీట్ చేసే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విశ్వరూపం ఒక కనుల పండుగ అని చెప్పాలి ముఖ్యంగా కొన్ని షాట్స్ భీం ఎదురుగా ఒక ఎగసిపడే ఒక అల, మెరుపుల నడుమ గొలుసులతో నిలబడి ఉన్న దృశ్యం, యుద్ధ సన్నివేశంలో భీం ఎగరవేసే జెండా, సూర్యుడికి మరో ప్రతిబింబంలా విరిసిన ఈటె, భీం కంటి నుంచి రక్తపు చుక్క పడితే జరిగే విస్ఫోటనం, ఆరుపలకల దేహంలో ఎన్టీఆర్ ఉగ్ర రూపం, చివరిగా అడవిలో చిరుత వేగాలతో ఈ టీజర్ ఒక అద్భుతం అంతే.


కీరవాణి సంగీతం మరియు టీజర్ లోని వి ఎఫ్ ఎక్స్ షాట్స్ అయితే మరో లెవెల్ అని చెప్పాలి.ఇక యంగ్ టైగర్ అభిమానుల రెండేళ్ళ దాహాం,నిరీక్షణ ఈ ఒక్క టీజర్ తో తీరిపోయింది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి రెండు టీజర్లు విడుదలైయ్యాయి,కేవలం టీజర్లే ఈ రేంజ్లో ఉంటే రెండు మాస్ అభిమానులున్న హీరోలతో సినిమా చేస్తున్న రాజమౌళి గారు ఏ రేంజ్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారో ఊహకందనిది.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో సహా సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: