క్లీన్ ఎంటర్టైనర్ తో రిలీజ్ కి రెడీ అయిన సాయిధరమ్ తేజ్..!

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కొన్ని ఫ్లాపుల తర్వాత గత సంవత్సరం ‘ చిత్రలహరి ‘ తో కమ్ బ్యాక్ అయి మళ్ళీ ‘ ప్రతిరోజూ పండగే ‘ సినిమాతో డీసెంట్ హిట్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు.

అదే జోరుతో కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ‘ సోలో బ్రతుకే సో బెటరు ‘ అంటూ యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు, మే 1న విడుదల అవ్వాల్సిన ఈ‌ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు అన్నీ పనులు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అయ్యింది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘ U ‘ సర్టిఫికేట్ లభించింది, ఇక నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ స్వరాలు అందించారు.శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: