ఆ మలయాళ సూపర్ హిట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్…!

ఈ సంవత్సరం ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా 4 సినిమాలు ప్రకటించి ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇచ్చారు. అందులో భాగంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘ వకీల్ సాబ్ ‘ శరవేగంగా పనులు పూర్తి చేసుకొని ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతుంది.మిగితా మూడు విషయాలకి వస్తే బ్లాక్ బస్టర్ డైరక్టర్ హరీష్ శంకర్ , వైవిధ్యమైన చిత్రాలు తీసే క్రిష్ , స్టైలిష్ చిత్రాలు చేసే సురేందర్ రెడ్డి ఈ మూడు డైరక్టర్స్ తో వరుస పెట్టి సినిమాలు చేయనున్నారు. ఇప్పుడు వీటితో పాటు మలయాళ సూపర్ హిట్ ‘ అయ్యప్పన్ కోషియమ్ ‘ రీమేక్ చేస్తున్నారు.

ఈ విషయమై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.ఈ విషయాన్ని నిజం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.వీడియో రూపంలో ఇచ్చిన సమాచారం ‘ కింగ్ ఆఫ్ య్యాటిటూడ్ మన అందరి సూపర్ కాప్ మరోసారి హై వోల్టేజ్ పాత్ర చేయబోతున్నారు ‘ అని చెప్తూ సంగీత దర్శకుడిగా తమన్ పేరుని రివీల్ చేశారు, ఇప్పటికే తమన్ వకీల్ సాబ్ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.ఒరిజినల్ వెర్షన్ లో చేసిన ముఖ్యమైన పాత్రలో దగ్గుబాటి రానా నటించే అవకాశాలు ఉన్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘ అప్పట్లో ఒకడుండేవాడు ‘ ఫేమ్ సాగర్.కె‌.చంద్ర దర్శకుడు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: