మరోసారి ఫ్లాప్ అయిన సాహో…!

గత సంవత్సరం భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాల్లో సాహో ఒకటి. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా భారతీయ చలనచిత్ర రంగంలోని భారీ తారాగణం తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది సాహో.తెలుగులో హిట్ ఇవ్వడానికి కొంత ఆలస్యం అయిన బాలీవుడ్ లో మాత్రం భారీ వసూల్లను సృష్టించింది. రెండో సారి గానీ చూస్తే అర్థం కానీ స్క్రీన్‌ప్లే తో సాహో కథ-కథనాలు నడిచాయి.

మొత్తానికి తెలుగులో మాత్రం మినిమమ్ మార్కులతో పాస్ అయ్యింది సాహో.కానీ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా కాస్త ముందుగానే అక్టోబర్ 18న జీ తెలుగులో ప్రసారం అయ్యింది. ఇక్కడ కూడా సాహో ఫ్లాప్ అయ్యింది. ఊహించిన విధంగా కూడా కాకుండా కేవలం 5.8 రేటింగ్స్ నే నమోదు చేసుకొని భారీ ఫ్లాప్ అనిపించుకుంది.అదే రోజు ఈటీవీలో ప్రసారమైన ‘ గుణ 369’ 5.9 టీఆర్పీని నమోదు చేసుకుంది. రెండో సారి చూస్తే గానీ థ్రిల్లింగ్ అనిపించని స్క్రీన్‌ప్లే తో తెరకెక్కిన సాహో బుల్లితెర పై కూడా అలరించలేకపోయింది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: