షూటింగ్ కు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్…!

ఎన్నికల షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా ‘ వకీల్ సాబ్ ‘ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. వేసవి కానుకగా మే లో విడుదల అవ్వాల్సిన వకీల్ సాబ్ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ తో సహా ఆగిపోవాల్సి వచ్చింది.

కానీ ఇప్పుడు అన్నీ సినిమా షూటింగ్స్ అన్ లాక్ ద్వారా ప్రభుత్వ నియమాలతో తిరిగి నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ మొదలెట్టింది కాకపోతే ఈ షెడూల్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. ఈ చిత్ర యూనిట్ ముందుగా ఇతర తారాగణం పై ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. నవంబర్ మొదటి వారం నుండి పవన్ కళ్యాణ్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు, ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ అంతా పూర్తౌతుందని తెలుస్తుంది.ఇక తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ ‘ పింక్ ‘ కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: