షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రయోగాత్మక చిత్రం..!

కామెడీ సినిమాలు చేస్తూ మినిమమ్ గ్యారంటీ హిట్ హీరోగా అల్లరి నరేష్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
అప్పుడప్పుడు కొన్ని వినూత్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.ఇప్పటికే ‘ నాంది ‘ అనే మరో ప్రయోగత్మక చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే, విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రం ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్న , ఇటీవలే విడుదలైన టీజర్ తో ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ మంచి ఆదరణ లభించింది.

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తైంది, అలాగే ప్రముఖ ఓటిటిల నుంచి ఆఫర్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదల అవుతుందా లేదా ఇలాంటి పరిస్థితులలో అదే ఓటిటిలో వస్తుందా అన్నది చూడాలి.ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకల అందిస్తుండగా, ప్రముఖ డైరక్టర్ హరీష్ శంకర్ దగ్గర మొదటి నుంచి దర్శకత్వ శాఖలో పని చేసిన విజయ్ దర్శకత్వం వహిస్తుండగా , డైరక్టర్ సతీష్ వేగేశ్న గారు నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: