విక్టరీ వెంక‌టేష్ `నార‌ప్ప` షూటింగ్ షురూ..!!!

లాక్ డౌన్ మూలాన షూటింగ్ దశలో ఆగిపోయిన సినిమాలు ఇప్పుడు తిరిగి మొదలవుతున్నాయి.ఆ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ చేస్తున్న ‘ నారప్ప ‘ షూటింగ్ కూడా ఈరోజు నుండి మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇదివరకే సగంకి పైగా చిత్రీకరించుకున్న , మిగిలిన భాగం ఈరోజు నుంచి చిత్రీకరణ జరుపుకోబోతుంది.

తమిళ సూపర్ హిట్ ‘ అసురన్ ‘ కు ఇది అఫీషియల్ రీమేక్. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా గత ఏడాది వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది, ముఖ్యంగా ధనుష్ నటనకు మంచి ఆదరణ లభించింది. తెలుగులో వెంకటేష్ సరిపోతారా? లేదా అనుకుంటున్న సమయంలో ఫస్ట్ లుక్ తో అందరి నోళ్ళకి తాళం వేసింది చిత్ర యూనిట్. వెనుకబడిన తరగతి వారి నేపథ్యంలో జరిగే కథాంశంతో వస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు మరియు కలైపులి థాను నిర్మిస్తుండగా , మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: