షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ్…!

కింగ్ నాగార్జున ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోస్ తో బిజీబిజీగా ఉన్నారు. సెప్టెంబర్ లో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఇటీవలే ఆ షోకి బ్రేక్ ఇచ్చి చాలా అత్యవసరంగా ఎప్పుడో మొదలైన మోస్ట్ అవైటెడ్ ‘ వైల్డ్ డాగ్ ‘ సినిమా కోసం హిమాలయాల్లో షూటింగ్ కి వెళ్ళారు. ఇటువంటి ఉష్ణోగ్రతల్లో కూడా అక్కడ చాలా త్వరగా షూటింగ్ ముగించుకున్నారు, ఈ షెడ్యూల్ చిత్రానికి చాలా కీలకం అని తెలుస్తుంది.

ఇప్పుడు ఆ షెడ్యూల్ మొత్తానికి పూర్తి చేసుకొని తిరుగు పయనమైయ్యారు, అయితే రాగానే మళ్లీ ఈ బిగ్ బాస్ లో బిజీ అవ్వనున్నారని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయినప్పటి నుంచి అభిమానులతో సహా సాధారణ ప్రేక్షకులు సైతం ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో నాగ్ ఎన్.ఐ.జెడ్ కనిపిస్తుండగా తదితర ముఖ్య పాత్రల్లో సైయామి ఖేర్ , అలీరెజా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అహిషర్ సల్మాన్ దర్శకత్వం వహిస్తుండగా , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: