గబ్బర్ సింగ్ తో ముచ్చటగా మూడో సారి ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ తో బిజీ అయ్యారు. ఇటీవలే షూటింగ్ కోసం మెట్రో రైల్ లో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ ఫోటోస్ వైరల్ అయ్యాయి, ఒక కఠిన దీక్ష కోసం పెంచిన గడ్డం, జుట్టులో పవన్ చెరిష్మా అదిరింది,అయితే ఇప్పుడు సెట్లో పవన్ క్లీన్ షేవ్ తో షూట్ కోసం మేకొవర్ చేసుకొని పాల్గొంటున్నారు.ఇక డిసెంబరు మొదటి వారంలో పవన్ కళ్యాణ్ , శ్రుతిహాసన్ మధ్యలో వచ్చే సీన్స్ ని చిత్రీకరించనుంది చిత్ర యూనిట్.

ఇంతకుముందు గబ్బర్ సింగ్ , కాటమరాయుడులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో పవన్ కు భార్యగా అదికూడా అతితక్కువ నిడివి గల పాత్రలో నటించబోతుంది.ఇక బాలీవుడ్ సూపర్ హిట్ ‘ పింక్ ‘ కు అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకుడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు , బోణికపూర్ లు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. గత వేసవిలో విడుదల అవ్వాల్సిన సినిమా ఈ వచ్చే సంక్రాంతి లేదా వేసవి ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: